RTC Bus CCTV Cameras | ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Bus CCTV Cameras | ప్రయాణికుల భద్రత కోసం TGSRTC కీలక చర్యలు చేపట్టింది. బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.

ఆర్టీసీ “బస్సులో భరోసా” పేరుతో సీసీ టీవీ కెమెరాలను అమర్చింది. ఇకపై ప్రతి ప్రయాణికుడి కదలిక 24 గంటలూ నిఘా పరిధిలో ఉంటుంది. పోలీసు శాఖ సమన్వయంతో “బస్సులో భరోసా” పేరుతో రూపొందించిన ఈ నూతన భద్రతా ప్రాజెక్టు, మొదటి దశలో ఆదిలాబాద్ (Adilabad)​ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆదిలాబాద్ రీజియన్‌లోని సుమారు 175 బస్సుల్లో కెమెరాలను అమర్చారు.

RTC Bus CCTV Cameras | బస్సు అంతా కవర్​ చేసేలా..

డ్రైవర్ క్యాబిన్, మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక సీట్లు, ఫుట్‌బోర్డులు, చివరి సీటుతో సహా బస్సులోని ప్రతి అంగుళాన్ని కవర్ చేసేలా ప్రత్యేక సాంకేతికతతో కెమెరాలు ఏర్పాటు చేశారు. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణ సమయంలో జరిగే ప్రతి అంశం ఇందులో రికార్డవుతాయి. ఈ కెమెరాలను RTC కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు.

RTC Bus CCTV Cameras | నేరాల నియంత్రణకు..

ఆర్టీసీ బస్సుల్లో పలువురు చోరీలకు పాల్పడుతున్నారు. ప్రయాణికుల బ్యాగులను తస్కరిస్తున్నారు. మరికొందరు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఇతర కేసుల్లో నిందితులు బస్సుల్లో ఎక్కి తప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిని పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడనున్నాయి. అవాంఛనీయ సంఘటన, ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే కచ్చితమైన ఆధారాలను సేకరించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

 

దీనిని కూడా చదవండి : Ponguleti Paper Controversy | మంత్రి వాకిటి శ్రీహరి మీద పేపర్లు విసిరేసిన పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *