Kamareddy Congress Groups | కామారెడ్డి కాంగ్రెస్​లో తలోదారి.. వేర్వేరుగా పీసీసీ చీఫ్​ జన్మదిన వేడుకలు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress Groups | టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) జన్మదిన వేడుకలతో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రూప్​లు మరోసారి బయటపడ్డాయి. ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులు రెండు వేర్వేరు నియోజకవర్గ కార్యాలయాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Kamareddy Congress Groups | డీసీసీ అధ్యక్షుడిగా ఏలె మల్లికార్జున్​ నియామకం

డీసీసీ అధ్యక్షకుడిగా ఏలే మల్లికార్జున్ నియామకమైన తర్వాత కామారెడ్డి (kamareddy) పట్టణంలోని జీఆర్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇకపై అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచి కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు వేర్వేరుగానే సాగుతూ ఉన్నాయి. వేళ్లపై లెక్కపెట్టే కార్యక్రమాలు మాత్రమే డీసీసీ (DCC Kamareddy) కార్యాలయంలో జరిగాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినా వేర్వేరు నియోజకవర్గాల కార్యాలయాల్లో ఏర్పాటు చేయడంతో రెండు కార్యాలయాలు ఉంటాయా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Kamareddy Congress Groups | షబ్బీర్​అలీ నివాసం వద్ద..

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) నివాసం వద్ద ఒకటి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆఫీసు వద్ద ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. షబ్బీర్ అలీ ఇంటివద్ద కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్, మరొక చోట టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్​లో కొంతకాలంగా గ్రూప్​లు కొనసాగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి ఊతం ఇస్తూ ఇవాళ రెండు చోట్ల కార్యక్రమాలు చేపట్టడంతో గ్రూపులు నిజమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని పైకి చెబుతున్నా అంతర్గతంగా మాత్రం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇకనైనా పార్టీ అధిష్టానం నాయకులను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని కిందిస్థాయి క్యాడర్ కోరుతున్నారు.

ఇది కూడా చూడండి: Russia hypersonic missile | ఉక్రెయిన్‌పై రష్యా హైపర్‌సోనిక్ క్షిపణితో దాడి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *