Russia hypersonic missile | ఉక్రెయిన్‌పై రష్యా హైపర్‌సోనిక్ క్షిపణితో దాడి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Russia hypersonic missile | ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుకుపడింది. పెద్ద ఎత్తున డ్రోన్లు హైపర్​ సోనిక్​ క్షిపణితో దాడికి పాల్పడింది. దీంతో ఇద్దరు మరణించగా, మరో 83 మంది గాయపడ్డారు. దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఈ దాడిలో మాస్కో శక్తివంతమైన హైపర్‌సోనిక్ ఒరేశ్నిక్ బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించిందని, నాలుగేళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆయుధాన్ని ఉపయోగించడం ఇది మూడోసారి అని తెలిపారు.

Russia hypersonic missile | కీవ్​లోని పలు ప్రాంతాల్లో నష్టం

రష్యా చేసిన దాడిలో ఉక్రెయిన్ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. దాడుల్లో నివాస భవనాలు, పాఠశాలలు, ఒక మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోని ప్రాంతాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

ఉక్రేనియన్ సైనిక కమాండ్ కేంద్రాలు, వైమానిక స్థావరాలు, రక్షణ పరిశ్రమ సౌకర్యాలపై జరిగిన దాడుల్లో ఒరేశ్నిక్ క్షిపణితో పాటు ఇతర క్షిపణి వ్యవస్థలను కూడా ఉపయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. రష్యా భూభాగంలోని పౌర ప్రాంతాలపై ఇటీవల ఉక్రెయిన్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిపినట్లు మాస్కో తెలిపింది.

Russia hypersonic missile | రష్యా ఒరేశ్నిక్ క్షిపణి..

ఒరేశ్నిక్ క్షిపణి రష్యా సైనిక ఆయుధాగారంలోని అత్యంత అధునాతన, ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటిగా చెబుతుంటారు. అణ్వాయుధాలను లేదా సంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లేలా రూపొందించబడిన ఈ క్షిపణి, సుదూర లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలను అధిగమించే లక్ష్యంతో రష్యా దీనిని తయారు చేసింది.

ఇది కూడా చదవండి..: Pakistan Train Blast | పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *