అంతర్జాతీయంIran America Talks | పాకిస్థాన్‌‌కు ఇరాన్ మంత్రి.. యుద్ధానికి బ్రేక్ పడేనా?

Iran America Talks | పాకిస్థాన్‌‌కు ఇరాన్ మంత్రి.. యుద్ధానికి బ్రేక్ పడేనా?

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌కు చేరుకోనున్నారు. అమెరికాతో ఆయన రెండో విడత చర్చలు జరపనున్నట్లు సమాచారం.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran America Talks | పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araqchi) శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌కు చేరుకోనున్నారు. అమెరికాతో రెండో విడత శాంతి చర్చలు జరిపే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ పర్యటన అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతోంది.

Iran America Talks | నిర్ణయాత్మక దిశగా చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వరుస హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ఇరాన్ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పర్యటనకు ముందే అరాగ్చీ పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, పాక్ ఆర్మీ చీఫ్ (Pak Army Chief) మునీర్‌తో ఫోన్‌లో సంభాషించారు. ప్రాంతీయ భద్రత , కాల్పుల విరమణ అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

Iran America Talks | పాక్‌లో యూఎస్ బృందాలు

ఇప్పటికే అమెరికా (America)కు చెందిన భద్రతా, లాజిస్టిక్స్ బృందాలు ఇస్లామాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రెండో విడత చర్చలు త్వరలోనే ప్రారంభమవుతాయనే సంకేతాలను ఇస్తోంది. తొలి విడత చర్చల్లో పెద్దగా పురోగతి లేకపోయినా, ఈసారి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్థాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అయితే ట్రంప్ సర్కార్ విధిస్తున్న కఠిన నిబంధనలు, ఇరాన్ అణు కార్యక్రమంపై పట్టు వీడకపోవడం వంటి అంశాలు చర్చల సక్సెస్‌పై సందిగ్ధతను పెంచుతున్నాయి.

దీనిని కూడా చదవండి : Iran Counter | భారత్‌ వచ్చి చూడండి.. ట్రంప్‌ వ్యాఖ్యలకు ఇరాన్‌ కౌంటర్‌

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...