Trump Iran Remarks | ఇరాన్​లో నాయకులు లేరు.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్​లో నాయకులు లేరని ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Iran Remarks | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) ఇరాన్​పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో ప్రస్తుతం నాయకులు ఎవరూ లేరని, ఎవరితో చర్చలు జరపాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్నారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్​ తన ప్రసంగాల్లో ఇరాన్​పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మాట్లాడుతూ.. వారి దగ్గర విమానాలు లేవు, నౌకలు లేవు, నాయకులు లేరు, ఏమీ లేవని టెహ్రాన్​ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వారి మొదటి స్థాయి నాయకుడు లేడు, రెండో స్థాయి నాయకుడు కూడా లేడు… అసలు తాను ఎవరితో చర్చలు జరపాలో అర్థం చేసుకోవాల్సి ఉందని వ్యంగ్యంగా అన్నారు.

Trump Iran Remarks | ఎన్నికల తర్వాత..

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ (Iran)​లోని కీలక నేతలు హతం అయ్యారు. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సైతం మరణించారు. ఈ క్రమంలో ట్రంప్​ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దాడులను తాత్కాలికంగా నిలిపివేశాయి. నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత దాడులు మళ్లీ మొదలవుతాయని ట్రంప్ సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు ఇరాన్​ సైతం ప్రతిదాడులకు సిద్ధం అవుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాట్లాడుతూ, యుద్ధం మళ్లీ మొదలైనా తమ దేశ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : Kharge Modi Controversy | మోదీ తండ్రి కూడా దిగిపోవాల్సిందే.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *