అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kharge Modi Controversy | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ తండ్రి కూడా దిగిపోవాల్సిందే అన్నారు. పాట్నాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
పాట్నా సభలో ఖర్గే మాట్లాడుతుండగా.. సభలో ఉన్న ఒక వ్యక్తి “మోదీ నహీం జాయేగా” (మోదీ వెళ్లరు/అధికారం కోల్పోరు) అని నినాదాలు చేశారు. దీంతో సంయమనం కోల్పోయిన ఖర్గే “మోదీ కా బాప్ భీ జాయేగా” (మోదీ తండ్రి కూడా వెళ్లాల్సిందే) అని అన్నారు. ఆయన మూడు సార్లు ఈ మాట అన్నారు. కాగా మోదీకి మద్దతుగా మాట్లాడిన వ్యక్తిని కాంగ్రెస్ మద్దతుదారులు కొట్టి, సభ నుంచి బయటకు గెంటేశారు.
Kharge Modi Controversy | బీజేపీ ఆగ్రహం
ఖర్గే ప్రధానిని, ఆయన దివంగత తండ్రిని మాత్రమే కాకుండా, దేశాన్ని కూడా అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఖర్గే మర్యాద అన్ని నియమాలను ఉల్లంఘించారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోదీజీపై గానీ, ఆయన కుటుంబంపై గానీ దూషణలు చేయడం ఇది మొదటిసారి కాదన్నారు. ఆయన తల్లిని అవమానించారని, ‘మృత్యు వ్యాపారి’ అని ‘చాయ్‌వాలా’ అని పిలిచి ఎగతాళి చేశారన్నారు.
Kharge Modi Controversy | తప్పుగా అర్థం చేసుకున్నారు
సభలో మోదీ వెళ్లరు అని వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సంతోష్ కుమార్‌గా గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తాను మోదీకి మద్దతుదారుడిని కాదన్నారు. ఒకవేళ తిరుగుబాటు రాకపోతే, మోదీ వెళ్ళరు అని అన్నానని, కానీ చివరి భాగం మాత్రమే వినిపించడంతో అపార్థం చేసుకున్నారని చెప్పారు.
#WATCH | A ruckus broke out during Congress national president Mallikarjun Kharge’s address at the 139th birth anniversary celebration of Dr. Shri Krishna Singh in Patna, Bihar
A person present at the event said that PM Modi would not go anywhere, Kharge responded, “Modi ka baap bhi jayega.”
— ANI (@ANI) October 25, 2026
దీనిని కూడా చదవండి : Rice Millers Scam | సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా.. మిల్లర్లపై కేసు