Banswada Gambling Raid | అడవిలో గుట్టుగా పేకాట.. దాడిచేసి పట్టుకున్న పోలీసులు

అడవిలో గుట్టుగా పేకాడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Gambling Raid | అడవిలో గుట్టుగా పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బాన్సువాడ (Banswada) మండలంలోని తాడ్కోల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.

Banswada Gambling Raid | పక్కా సమాచారం మేరకు..

సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్కోల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు దాడులు చేశారు.  ఈ క్రమంలో ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.50,280 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేకాట చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా జూదం అడుతున్నట్లు సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్​పై అభిమానం.. 70 ఏళ్ల వయస్సులో పొలిటికల్​ ఎంట్రీ..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *