జాతీయంBengal Polling Controversy | బెంగాల్ ఎన్నికల్లో 'గుర్తు' రచ్చ.. రీపోలింగ్‌కు బీజేపీ డిమాండ్!

Bengal Polling Controversy | బెంగాల్ ఎన్నికల్లో ‘గుర్తు’ రచ్చ.. రీపోలింగ్‌కు బీజేపీ డిమాండ్!

పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అక్షరటుడే, పోలింగ్: Bengal Polling Controversy | పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో రెండో దశ పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డైమండ్ హార్బర్ లోని ఫల్తా నియోజకవర్గంలో పలు పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర ఆరోపణలు చేసింది.

Bengal Polling Controversy | ఏం జరిగిందంటే:

బీజేపీ పశ్చిమ బెంగాల్ కో-ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ (Amit Malviya) సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ యంత్రాల్లోని ‘కమలం గుర్తు’ (బీజేపీ గుర్తు) కనిపించకుండా అధికారులు దానిపై టేపులు అంటించారని ఆయన ఆరోపించారు. దీనివల్ల ఓటర్లు బీజేపీకి ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలు స్థానిక యంత్రాంగంతో చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Bengal Polling Controversy | అప్రజాస్వామిక వ్యూహాలు:

గతంలో అభిషేక్ బెనర్జీ విజయం సాధించినప్పుడు కూడా ఇలాంటి అప్రజాస్వామిక వ్యూహాలనే అనుసరించారని ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండటంతో ఎన్నికల కమిషన్ (EC) రంగంలోకి దిగింది.

ఎన్నికల కమిషనర్ :పోలింగ్‌ బూత్‌లలో బటన్ల ట్యాంపరింగ్‌పై అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు బెంగాల్ ఎన్నికల కమిషనర్ (Bengal Election Commissioner) తెలిపారు. ఒకవేళ బీజేపీ చేసిన ఆరోపణలు నిజమని తేలితే, ఆయా బూత్‌లలో తక్షణమే పోలింగ్‌ను రద్దు చేసి, తిరిగి ఎన్నిక (రీపోలింగ్) నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను మరింత పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ ప్రతి విమర్శలు చేయడం గమనార్హం. ప్రస్తుతం బెంగాల్ రాజకీయ వాతావరణం ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కింది.

ఇది కూడా చదవండి..: Railway Jobs Recruitment | రైల్వేలో ఉద్యోగాల జాతర.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...