Lalit Modi | సోనియా గాంధీపై లలిత్​ మోదీ సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lalit Modi | ఐపీఎల్ (IPL)​ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్​ లలిత్​ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2010లో కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీకి సంబంధించి తలెత్తిన వివాదంపై సోనియా గాంధీపై ఆయన ఆరోపణలుచేశరు.

జట్టు యాజమాన్య నిర్మాణం, సునంద పుష్కర్ పాత్రపై తాను ప్రశ్నించినప్పుడు తనపై రాజకీయ ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. పుష్కర్‌కు సంబంధించి అన్యాయమైన ఈక్విటీ ఒప్పందం ఉందని తాను భావించిన కారణంగా కొచ్చి కన్సార్టియంను ఐపీఎల్‌లోకి ప్రవేశించకుండా ఆపడానికి ప్రయత్నించానని చెప్పారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) శశి థరూర్​కు మద్దతు ఇచ్చారని, అలాగే తనపై సీనియర్ రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చిందని ఆరోపించారు.

Lalit Modi | పతనానికి దారి తీసింది

ఐపీఎల్ జట్టు వాటాదారుల విషయంలో తాను చేసిన పరిశీలన రాజకీయ వ్యతిరేకతకు దారితీసిందని లలిత్​ మోదీ అన్నారు. చివరికి భారత క్రికెట్ పరిపాలనలో తన పతనానికి అది దోహదపడిందని పేర్కొన్నారు. బిడ్ పట్ల తనకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ, కోచీని ఐపీఎల్‌లోకి ఎందుకు అనుమతించారో కూడా మోడీ వెల్లడించారు. బిడ్‌ను సులభతరం చేయడానికి థరూర్ స్వయంగా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తనకు ఆ సమయంలో అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీల నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. కాగా ఆర్థిక వివాదం కారణంగా 2011లో బీసీసీఐ రద్దు చేయడంతో కొచ్చి ఫ్రాంచైజీ కేవలం ఒక ఐపీఎల్ సీజన్ మాత్రమే కొనసాగింది.

lalit

Lalit Modi | హత్యకు కుట్ర పన్నారు

భారత క్రికెట్ పరిపాలన నుంచి వివాదాస్పదంగా వైదొలిగిన లలిత్​ మోదీ అందుకు గల కారణాలను వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం, అతని గ్యాంగ్​ నుంచి వచ్చిన ప్రాణహాని బెదిరింపులే తాను క్రికెట్ పరిపాలన నుంచి శాశ్వతంగా వైదొలగడానికి ప్రధాన కారణమని మాజీ ఐపీఎల్ ఛైర్మన్​ పేర్కొన్నారు. మ్యాచ్​ ఫిక్సింగ్​ వ్యతిరేకంగా తాను నిర్ణయం తీసుకోవడంతో దావూద్​ కంపెనీ నియంత్రణలో ఉన్న బెట్టింగ్​ నెట్​వర్క్​తో ఘర్షణకు దారితీసిందని లలిత్ తెలిపారు. దీంతో దావూద్ ఇబ్రహీం తనను లక్ష్యంగా చేసుకుని మూడు వేర్వేరు హత్యకు యత్నించారని ఆరోపించారు. లండన్‌లో తన కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడని కూడా ఆయన పేర్కొన్నారు.

Lalit Modi | అద్భుతమైన ఆటగాడు

ipl

వైభవ్ సూర్యవంశి గురించి కూడా లలిత్​ మోదీ స్పిందించాఉ. అతను ఎంత అద్భుతమైన ఆటగాడో అన్నారు. ఈ భూమండలంపై అందరికంటే అతను గొప్పవాడవుతాడు. ఏ హాలీవుడ్ లేదా బాలీవుడ్ తార కంటే అయినా అతను ఎత్తుకు ఎదుగుతాడు. ఈ ప్రపంచంలోని మెస్సీల కంటే కూడా అతను గొప్పవాడవుతాడు… అతని బ్యాటింగ్ శైలిని, ఆ కుర్రాడిలో ఉన్న నిర్భయత్వాన్ని చూసినప్పుడు, నేను ఈ మాటను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను. ఆ చిన్న వయసులోనే అంతటి ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం నిజంగా ఒక మాయాజాలం అని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : DK Shivakumar Decisions | కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక నిర్ణయాలు.. విద్యార్థులు, నిరుద్యోగులపై వరాల జల్లు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *