Telangana Weather Alert | నేడు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో తుఫాను.. హైదరాబాద్‌కూ అలర్ట్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Weather Alert | ఎండల తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ 4 (గురువారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోందని, రానున్న కొన్ని గంటల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది.
rain

Telangana Weather Alert | పశ్చిమ, మధ్య తెలంగాణలో ..

రాష్ట్రంలోని పశ్చిమ మరియు మధ్య ప్రాంత జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. బలమైన ఈదురు గాలులతో పాటు అత్యంత శక్తివంతమైన పిడుగులు (Intense Lightening) పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని సూచించారు.

rain.1

Telangana Weather Alert | అర్ధరాత్రి వేళ భాగ్యనగరంలో ..

హైదరాబాద్ వాసులకు కూడా వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో ఇవాళ లేట్ ఈవెనింగ్ (సాయంత్రం దాటిన తర్వాత) నుండి మిడ్ నైట్ (అర్ధరాత్రి) లోపు ఎప్పుడైనా ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చెదరుమదురుగా ప్రారంభమై, ఆ తర్వాత అంతటా ఊపందుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఆఫీసుల నుండి ఇళ్లకు తిరిగొచ్చే వారు, రాత్రి ప్రయాణాలు చేసే వారు వాతావరణ పరిస్థితులను గమనించి బయలుదేరడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Southwest Monsoon | కేరళంను తాకిన రుతుపవనాలు.. జూన్​ రెండో వారంలో రాష్ట్రంలోకి..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *