Paddy Farmers | యాసంగిలో వరి వేయొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

యాసంగిలో వరి పంట సాగు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఒక్క సీజన్​లో పంటల సాగును వాయిదా వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Farmers | యాసంగిలో వరి పంట సాగు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోరారు. ఒక్క సీజన్​లో పంటల సాగును వాయిదా వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎల్‌నినో ఎదుర్కోడానికి అండగా ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి రైతులను కోరారు. కొందామన్నా, నీళ్లు కొనుగోలు చేయలేమని చెప్పారు. యాసంగి పంటను తగ్గించాలని, ఒక సీజన్ పంట వాయిదా వేయాలని సూచించారు. ఉన్న నీళ్లను పొదుపుగా వాడుకోవాలన్నారు. వచ్చే పది నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరో చెప్పే మాటలు విని నమ్మొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సాగునీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలన్నారు. ఎంత ధర చెల్లించడానికైనా ముందుకొచ్చినా.. విద్యుత్ దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. అయినా రైతుల పంటలు దెబ్బతినకుండా కాపాడుకున్నామని చెప్పారు.

Paddy Farmers | రైతులను కేంద్రం ఆదుకోవాలి

రైతు కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పిస్తామని సీఎం తెలిపారు. పంట వేయని రైతులను కేంద్రం కూడా ఆదుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర పథకాలతో విపత్తును ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం సాయం చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు కరోనా నాటి స్ఫూర్తిని చూపాలన్నారు. పార్టీలు, పౌరులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Paddy Farmers | కేబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు

ఎల్​నినో (El Nino)పై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ సీఎస్ కె. రామకృష్ణారావును నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. దసరా తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సహా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రధాని, హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకు వెళ్తామని చెప్పారు. ఎల్‌నినోపై వార్‌రూమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి : HYDRAA Land Protection | రూ.400 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *