తెలంగాణKodandaram TJS Meeting | ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం

Kodandaram TJS Meeting | ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం

గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో వెన్నంటే నిలిచిన వారిని కనీసం గుర్తించలేదని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kodandaram TJS Meeting| గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో వెన్నంటే నిలిచిన వారిని కనీసం గుర్తించలేదని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. గురువారం జిల్లాలో నిర్వహించిన టీజేఎస్ ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

Kodandaram TJS Meeting | ప్రసంగంలోని అంశాలు

తెలంగాణ సాధన కోసం అందరం కలిసి కట్టుగా పోరాడామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. భూసేకరణ బాధితులు, నిరుద్యోగులు, బీసీ రిజర్వేషన్లు, విద్య, వైద్యం,రైతుల సమస్యల పరిష్కారం కోసం టీజేఎస్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్, నిమ్స్ వంటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు.

Kodandaram TJS Meeting | రాజకీయాల్లో మార్పు రావాలి..

ప్రస్తుత రాజకీయాలు ప్రజల చుట్టూ కాకుండా డబ్బు, స్వార్థం చుట్టూ తిరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ప్రజా కేంద్రీకృత రాజకీయాలు జరగాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రం తీరును తప్పుపట్టారు. అలాగే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, సారవంతమైన భూములు గల సంగారెడ్డి జిల్లా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి నేతలు తుల్జా రెడ్డి, ఆశప్ప, సాయిలు, లక్ష్మి తదితరులు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.

ఇది కూడా చదవండి: China Ex Defense Ministers|అవినీతిపై చైనా ఉక్కుపాదం..ఇద్దరు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మరణశిక్ష

 

 

 

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Disaster Mock Drill | విపత్తుల సన్నద్ధతపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Disaster Mock Drill | ప్రకృతి విపత్తులు...

Bengal Cabinet Dissolved | బెంగాల్​ మంత్రివర్గాన్ని రద్దు చేసిన గవర్నర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengal Cabinet Dissolved | బెంగాల్‌ కేబినెట్‌ను...

Yellareddy Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని ఒకరి దుర్మరణం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త...

Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది...