China Ex Defense Ministers|అవినీతిపై చైనా ఉక్కుపాదం..ఇద్దరు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మరణశిక్ష

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:China Ex Defense Ministers|అవినీతిపై పోరాటంలో భాగంగా చైనా ప్రభుత్వం తన పూర్వ రక్షణ మంత్రులపై కఠిన చర్యలు తీసుకుంది. లంచాలు తీసుకోవడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం వంటి ఆరోపణలు రుజువు కావడంతో వీ ఫెంగే, లీ షాంగ్‌లకు మిలిటరీ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. అయితే, ఈ శిక్ష అమలును రెండేళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు అధికారిక వార్తా సంస్థ ‘జిన్హువా’ వెల్లడించింది.

China Ex Defense Ministers|నేపథ్యం , ఆరోపణలు..

వీ ఫెంగే 2018 నుంచి 2023 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు చైనా సైన్యంలోని అత్యంత కీలకమైన ‘రాకెట్ ఫోర్స్’ విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. లంచం తీసుకున్న కేసులో ఈయన దోషిగా తేలారు. లీ షాంగ్‌, వీ ఫెంగే తర్వాత రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. షాంగ్‌ను స్వయంగా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంపిక చేసినప్పటికీ, ఏడాది గడవకముందే ఆయనపై వేటు పడింది. ఈయన లంచాలు తీసుకోవడంతో పాటు ఇతరులకు ఆశ చూపినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 2024లోనే వీరిద్దరినీ కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించారు.

China Ex Defense Ministers|జిన్‌పింగ్ మార్క్ ప్రక్షాళన:

షీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చైనాలో ‘అవినీతి నిర్మూలన’ పేరుతో భారీ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్షలాది మంది అధికారులు, ఉన్నత స్థాయి సైనిక నాయకులు జైలు పాలవ్వగా, తాజా తీర్పు చైనా సైనిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు, ఇరాన్-అమెరికా మధ్య హర్మూజ్ జలసంధి పునరుద్ధరణకు సంబంధించి కూడా ఒప్పంద దిశగా అడుగులు పడుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy Convoy | సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *