అక్షరటుడే వెబ్‌డెస్క్: Godrej Agrovet Oil Palm | ఖమ్మం ( Khammam )జిల్లా అంజనాపురం గ్రామంలోని గోద్రెజ్ ఆగ్రోవెట్ (Godrej Agrovet) ఆయిల్ పామ్ ప్లాంట్‌లో మురుగునీటి ట్యాంకుకు సంబంధించి జరిగిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్లాంట్‌లోని సుమారు 30,000 లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి ట్యాంకు ప్రభావితం కావడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
Godrej Agrovet Oil Palm | క్షణాల వ్యవధిలో అదుపులోకి..
సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది.. మురుగునీరు పక్కనే ఉన్న భూమిలోకి మరింత వ్యాపించకుండా జేసీబీలతో అడ్డుకట్టలు (మట్టి కట్టలు) నిర్మించారు. వ్యర్థ జలాలు ప్లాంట్ పరిధి దాటి వెళ్లకుండా పూర్తిగా అదుపుచేశారు.
ఈ ఘటనపై గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ అధికారి ఒకరు స్పందిస్తూ.. “మా ప్లాంట్‌లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చాము. వ్యర్థ ద్రవాలు (ఎఫ్లూయెంట్) మా ప్రాంగణం లోపలే ఆగిపోయేలా తక్షణ చర్యలు తీసుకున్నాము. ఇందులో పూర్తిగా విజయవంతమయ్యాం. ప్లాంట్ వెలుపల ఎలాంటి ప్రభావమూ లేదు” అని స్పష్టం చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి స్థానిక అధికారులందరికీ సమాచారం అందించామని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు తెలిపారు.
Godrej Agrovet Oil Palm | అధికారుల తనిఖీలు ..
ఈ ఘటన వల్ల పర్యావరణానికి, కార్మికుల ఆరోగ్యానికి ఏదైనా ముప్పు ఉందా లేదా అని అంచనా వేయాలని స్థానికులు కోరుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు నిర్వహించే తనిఖీలు, వ్యర్థ జలాల నమూన పరీక్షల ద్వారా పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్లాంట్‌లో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: Flydubai Flight | పైలట్‌ను కత్తితో పొడిచిన కోపైలెట్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్