ICICI Prudential Life | కేవలం 1 రోజులోనే అకౌంట్‌లోకి డబ్బులు.. ఇన్సూరెన్స్ రంగంలో ఐసీఐసీఐ సంచలన రికార్డ్

ఆర్థిక సంవత్సరం 2026లో పాలసీదారుల కుటుంబాలకు అండగా నిలవడంలో ప్రముఖ జీవిత బీమా సంస్థ 'ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్' మరోసారి తన నిబద్ధతను చాటుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: ICICI Prudential Life | ఆర్థిక సంవత్సరం 2026లో పాలసీదారుల కుటుంబాలకు అండగా నిలవడంలో ప్రముఖ జీవిత బీమా సంస్థ ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్’ ( Insurance ) మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. పాలసీదారుల కుటుంబాలకు సగటున రూ. 15 లక్షల చొప్పున ఇండివిడ్యువల్ డెత్ క్లెయిమ్‌లను చెల్లించి, సకాలంలో ఆర్థిక తోడ్పాటు అందించడంలో వరుసగా రెండో ఏడాది కూడా అగ్రగామిగా నిలిచింది.

ICICI Prudential Life | క్లెయిమ్ పెరుగుదల.

బహిరంగంగా అందుబాటులో ఉన్న గత ఆరు ఆర్థిక సంవత్సరాల గణాంకాల ప్రకారం.. కంపెనీ సగటు ఇండివిడ్యువల్ డెత్ క్లెయిమ్ విలువ 2021లో రూ. 10 లక్షలుగా ఉండగా, 2026 నాటికి రూ. 15 లక్షలకు పెరిగింది. గత నాలుగేళ్లుగా ఇది సుమారు రూ. 14-15 లక్షల మధ్య స్థిరంగా కొనసాగుతోంది. ఆదాయాలు, రుణాలు, కుటుంబ బాధ్యతలు మారుతున్న కొద్దీ పాలసీదారులు తమ లైఫ్ కవరేజీని ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ. 5,149 కోట్ల విలువైన డెత్ క్లెయిమ్‌లను సెటిల్ చేసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 99.3 శాతంగా నమోదైంది. నాన్-ఇన్వెస్టిగేటెడ్ ఇండివిడ్యువల్ క్లెయిమ్‌లకు సంబంధించి చివరి డాక్యుమెంటు అందిన తేదీ నుంచి కేవలం 1.1 రోజుల్లోనే (టర్నెరౌండ్ టైమ్) క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు కంపెనీ వెల్లడించింది.

ICICI Prudential Life | బీమా ప్రధాన ఉద్దేశం..

ఈ సందర్భంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ (అండర్‌రైటింగ్ అండ్ రిటైల్ క్లెయిమ్స్) సారంగ్ గోఖలే మాట్లాడుతూ.. “కుటుంబాలకు క్లిష్ట సమయాల్లో ఆర్థిక భద్రత కల్పించడమే జీవిత బీమా ప్రధాన ఉద్దేశం. ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో సహాయం అందేలా టెక్నాలజీ ఆధారిత సేవలను అందిస్తున్నాము. కస్టమర్లు కూడా తమ మారుతున్న జీవిత దశలు, లక్ష్యాలకు అనుగుణంగా లైఫ్ కవరేజీని తరచుగా సమీక్షించుకోవాలి” అని సూచించారు.

ఇది కూడా చదవండి: Flydubai Flight | పైలట్​ను కత్తితో పొడిచిన కోపైలెట్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *