OYO IPO Approval | ఐపీవోకు ‘ఓయో’.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెబీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: OYO IPO Approval | పబ్లిక్‌ ఇష్యూకు రావాలనుకుంటున్న ఓయో పేరెంట్ కంపెనీ ప్రిజమ్.. 2025 డిసెంబర్‌లోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. కాన్ఫిడెన్షియల్ రూట్ ద్వారా సెబీ దగ్గర ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. దీనికి సెబీ ఆమోదం తెలిపింది.

OYO IPO Approval | కాన్ఫిడెన్షియల్ రూట్ అంటే..

OYO IPO Approval

కాన్ఫిడెన్షియల్ రూట్ అంటే కంపెనీలు తమ ఐపీవో పత్రాలను సెబీకి రహస్యంగా సమర్పించే విధానం. సాధారణంగా కంపెనీలు ఐపీవో (IPO)కు వచ్చేప్పుడు తమ ఆర్థిక వివరాలు, ఇతర అంశాలను బహిరంగంగానే వెల్లడిస్తాయి. కానీ కాన్ఫిడెన్షియల్ రూట్‌లో ఆ అవసరం ఉండదు. సెబీ మార్పులు కోరితే అవి కూడా కాన్ఫిడెన్షియల్‌ రూట్‌లోనే అప్‌డేట్‌ చేస్తాయి. మార్కెట్ పరిస్థితులు బాగోలేకపోతే ఐపీవో ప్రాసెస్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకునే స్వేచ్ఛ కంపెనీలక ఉంటుంది.

OYO IPO Approval | త్వరలో యూడీఆర్‌హెచ్‌పీ..

OYO IPO Approval

ఓయో ఐపీవోకు సెబీ ఆమోదం లభించడంతో కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్(యూడీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐపీవో పరిమాణం, షేర్ ఇష్యూ ప్రైస్, లాట్‌ సైజ్‌, సబ్‌స్క్రిప్షన్ తేదీలు, కోటా వంటి వివరాలు ప్రకటిస్తారు.

OYO IPO Approval | ఫ్రెష్ ఇష్యూ ద్వారానే..

ఐపీవో ద్వారా రూ. 6,650 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఐపీవో ప్రకటన తర్వాత పూర్తి పరిమాణం తెలుస్తుంది. ఇది పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారానే జరగనుంది. పబ్లిక్‌ ఇష్యూ సక్సెస్‌ అయితే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 76 వేల కోట్లకుపైనే ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: June 03 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *