అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Green Tax Rules | గ్రీన్ ట్యాక్స్ (Green Tax) అంటే పాత వాహనాలపై విధించే ప్రత్యేక పన్ను. చాలా మంది దీనిని అదనపు పన్నుగానే భావిస్తారు. కానీ ఇది అలా కాదు. కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూలమైన వాహనాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పన్నును విధిస్తోంది. సాధారణంగా 15 ఏళ్లపైబడిన వాహనాలకు ఈ పన్ను విధిస్తారు.
Green Tax Rules | పాతవాటితో కాలుష్యం ముప్పు..
సాధారణంగా వాహనం పాతది అవుతున్నా కొద్దీ అది తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఎక్కువ పొగ, హానికరమైన వాయువులను విడుదల చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో పాత వాహనాల వినియోగాన్ని తగ్గించి, తక్కువ పొల్యూషన్ ఉండే వాహనాలకు మారేలా ప్రజలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. కొత్తకొత్త నిబంధనలను అమలులోకి తీసుకువస్తోంది. అలాంటి నిబంధనలలో గ్రీన్ ట్యాక్స్ ఒకటి. సాధారణంగా 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువగా వాడిన కమర్షియల్ వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. ఓనర్లు తమ వాహనం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదా రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసే సమయంలో ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..: Mini Countryman C | స్టైలిష్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో.. బీఎండబ్ల్యూ నుంచి ప్రీమియం కారు లాంచ్