Stock Market Bull Run | బుల్ రన్ కంటిన్యూ.. ఐదో రోజూ లాభాలతో ముగిసిన సూచీలు..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Bull Run | దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. గురువారం మార్కెట్ ఒడిదుడుకులకు లోనయినప్పటికీ చివరికి ప్రధాన సూచీలు గ్రీన్ జోన్‌లో నిలిచాయి. వరుసగా ఐదో సెషన్‌లోనూ నిఫ్టీ, సెన్సెక్స్ లాభాలతో ముగియడంతో ఇన్వెస్టర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. ముడిచమురు ధరలు దిగిరావడం, రూపాయి బలోపేతం కావడం వంటి కారణాలతో మన మార్కెట్లు రాణించాయి.

Stock Market Bull Run | స్వల్ప నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 262 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 189 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 367 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 66 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 102 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని సెన్సెక్స్ 539 పాయింట్లు, నిఫ్టీ 152 పాయింట్లు పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 77,409 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 24,168 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Bull Run | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

Stock Market Bull Run

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,419 కంపెనీలు లాభపడగా 1,814 స్టాక్స్ నష్టపోయాయి. 186 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 162 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 46 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్ లాభపడగా.. 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 2.73 శాతం, ట్రెంట్ 2.52 శాతం, బీఈఎల్ 2.08 శాతం, ఎన్టీపీసీ 2.00 శాతం, ఎస్బీఐ 1.64 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 2.66 శాతం, టెక్ మహీంద్రా 1.07 శాతం, మారుతి 1.04 శాతం, టీసీఎస్ 0.82 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.41 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Green Tax Rules | గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటి..? ఏ వాహనానికి వర్తిస్తుందంటే?

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *