అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Kakatiya Engineering Graduates | నేటి సమాజంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని.. తమ లక్ష్యాలను చేరుకునేందుకు సామర్థ్యాలను పెంపొందించుకోవాలని తెయూ రిజిస్ట్రార్(TU registrar) యాదగిరి సూచించారు. నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో కాకతీయ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో స్నాతకోత్సవం (Convocation) నిర్వహించారు. తెయూ రిజిస్ట్రార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Kakatiya Engineering Graduates | కాకతీయ ఇంజినీరిగ్ కళాశాల..
ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడాలంటే విద్యార్థినులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ (career development) ముందుకెళ్లాలని రిజిస్ట్రార్ సూచించారు. అనంతరం ఆయన విద్యార్థినులకు ఇంజినీరింగ్ పట్టాలు అందజేశారు. కళాశాల డైరెక్టర్ చెరుకూరి రజనీకాంత్ విద్యార్థినులను అభినందించారు. వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో మా కళాశాల నుంచి 232 మంది విద్యార్థినులు ఇంజినీరింగ్ పట్టాలు పొందడం.. చాలామంది వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సెల్యం కుమార్ రాజా మాట్లాడుతూ మా కళాశాల నుంచి పట్టాలు పొందిన విద్యార్థినులు ఏ రంగంలో ఉన్నా కళాశాలకు, తల్లిదండ్రులకు, సమాజానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎస్టేట్ మేనేజర్ నాగేశ్వశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జి.సాయరెడ్డి, వివిధ శాఖల అధిపతులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

