ITI Walking Association | ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

నగరంలోని ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ITI Walking Association | నగరంలోని ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం గ్రౌండ్​లో వాకింగ్ అసోసియేషన్ (Walking Association) సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ITI Walking Association | అధ్యక్షుడిగా పృథ్వీరాజ్​..

ITI Walking Association

ఈ సమావేశంలో అధ్యక్షుడిగా పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శిగా మోహన్ గైక్వాడ్, కోశాధికారిగా శ్రీరామ్, గౌరవ అధ్యక్షుడిగా మురళీకృష్ణను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. వాకింగ్ గ్రౌండ్​లో వాకర్స్​కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అన్నారు. వాకింగ్ సభ్యుల ఆహ్లాదం కోసం 12ఏళ్ల నుంచి అనేక సేవా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సభ్యులతో మమేకమైనట్లు వారు తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి..: Shabbir Ali Audio | కాంగ్రెస్​లో ఏం జరుగుతోంది.. ‘షబ్బీర్​ అలీ’ ఆడియో వెనక ఉన్నదెవరు?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *