అక్షరటుడే, తాడ్వాయి: Jajala Surender Arrest | యూరియా యాప్ (Urea App)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉదయం నుంచి ధర్నా విషయంలో అనిశ్చితి నెలకొనగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Former MLA Jajala Surender) ఎంట్రీతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Jajala Surender Arrest | సాధారణ వ్యక్తిగా బైక్పై వచ్చి..
సాధారణ వ్యక్తి మాదిరిగా ఓ బైక్పై వచ్చిన సురేందర్ జై బీఆర్ఎస్, జై తెలంగాణ అంటూ ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, మాజీ ఎమ్మెల్యేకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మాజీ ఎమ్మెల్యేను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో ఎక్కించుకుని అక్కడినుంచి ఇతర పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపటికి బీఆర్ఎస్ నేతలు తాడ్వాయి చౌరస్తాకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వచ్చిన వాళ్ళను వచ్చినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే తాడ్వాయి సొసైటీ ఛైర్మన్ కపిల్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి పెట్రోల్ బాటిల్తో రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేశారు. దాంతో పోలీసులు అప్రమత్తమై కపిల్ రెడ్డి వద్ద నుంచి పెట్రోల్ బాటిల్ లాక్కుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా సీఐకి, కపిల్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి..: NEET Paper Leak | కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి