Hyderabad Metro Phase 2 | మెట్రో సెకండ్ ఫేజ్ భేటీ సక్సెస్.. త్వరలోనే కీలక నివేదిక

హైదరాబాద్ మెట్రో విస్తరణ కల సాకారమయ్యే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో ( Hyderabad Metro ) విస్తరణ కల సాకారమయ్యే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మెట్రో రెండో దశ విస్తరణకు, మొదటి దశ ఆస్తుల స్వాధీనంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.

Hyderabad Metro Phase 2 | ఢిల్లీలో సీఎం కీలక భేటీలు..

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. అనంతరం నేడు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మెట్రో సెకండ్ ఫేజ్ పనులు, ఐఆర్ఎఫ్సీ (IRFC) రుణం, అలాగే రాష్ట్రంలోని ఇతర కీలక ప్రాజెక్టులపై చర్చించారు.

Hyderabad Metro Phase 2 | ఎస్‌బీఐ క్యాప్స్ ఆధ్వర్యంలో నివేదిక..

మెట్రో ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో ఫేజ్-1 వాల్యుయేషన్ (ఆస్తుల విలువ), ఫేజ్-2 విస్తరణపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎస్‌బీఐ క్యాప్స్’ను కన్సల్టెంట్‌గా నియమించారు. ఎస్‌బీఐ క్యాప్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని సీఎం, కేంద్రమంత్రులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర అధికారి , రాష్ట్ర ఎంఏయూడీ (MAUD) ప్రత్యేక కార్యదర్శిని సమన్వయకర్తలుగా నియమించారు.

Hyderabad Metro Phase 2 | ముఖ్య ఉద్దేశం..

మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువను లెక్కించడం, వాటిని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకోవాలి? అలాగే ఐఆర్ఎఫ్సీ ద్వారా తక్కువ వడ్డీకి రుణం ఎలా పొందాలో ఈ నివేదికలో పొందుపరుస్తారు. దీని ఆధారంగా కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండో దశ మెట్రో విస్తరణ ప్లాన్‌లో దాదాపు 70 కిలోమీటర్లకు పైగా కొత్త మార్గాలు ఉండటం విశేషం.

ఇది కూడా చదవండి:  Hyderabad harassment case | అధికారి వేధింపులు భరించలేకపోతున్నా.. ప్రజాభవన్‌లో మహిళా ఉద్యోగిని ఫిర్యాదు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *