Operation Sindoor Heroes | ఆపరేషన్‌ సిందూర్‌ అమరవీరుల వివరాలు వెల్లడి.. ప్రభుత్వం కీలక ప్రకటన

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ఆరుగురు సైనికులను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుంది

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Operation Sindoor Heroes | జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ( లో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ఆరుగురు సైనికులను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుంది. దేశ రక్షణ కోసం వారు చేసిన త్యాగానికి గుర్తింపుగా, వారి పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలోని (National War Memorial) గ్రెనైట్ పలకలపై శాశ్వతంగా చెక్కనున్నట్లు ప్రకటించింది.

Operation Sindoor Heroes | తెలుగు రాష్ట్రాలకు చెందిన అగ్నివీర్..

వీరమరణం పొందిన వారిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు, ఒక వైమానిక దళ (IAF) సర్జెంట్ ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్ ఉండటం గమనార్హం.
వీరి పేర్లు: సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్, హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్ , సర్జెంట్ సురేంద్ర కుమార్.

Operation Sindoor Heroes | అత్యున్నత పురస్కారాల ప్రదానం..

ఈ ఆపరేషన్‌లో శత్రువులతో పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టిన వీరులకు ప్రభుత్వం గౌరవ పురస్కారాలను ప్రకటించింది. రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం దేశ మూడవ అత్యున్నత సైనిక పురస్కారమైన ‘వీరచక్ర’, వైమానిక దళానికి చెందిన సర్జెంట్ సురేంద్ర కుమార్‌కు ‘వాయుసేన మెడల్’ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ త్వరలోనే యుద్ధ స్మారకం వద్ద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఇది కూడా చదవండి: Draksharam Fire | ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *