Voter Enumeration Forms | ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలివ్వాలి

ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేయాలని నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Voter Enumeration Forms | ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేయాలని నిజామాబాద్ (Nizamabad) ఆర్డీవో రాజేంద్రకుమార్ సూచించారు. మండలంలోని మెంట్రాజ్​పల్లిలో పోలింగ్ బూత్​ల వారీగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని ఆర్డీవో పరిశీలించారు. తహశీల్దార్​ సతీష్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Voter Enumeration Forms | ఓటర్లకు స్పష్టంగా వివరించాలి..

Voter Enumeration Forms

కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైనన్ని ఫారాలు ఇవ్వాలని, ఓటరు పేరు, ఇంటి నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలను నిర్ధారించుకుని ఫారాలు అందజేయాలని ఆర్డీవో సూచించారు. ఫారం ఎలా నింపాలో ఓటరుకు స్పష్టంగా వివరించాలని, అవసరమైన ధ్రువపత్రాలు జత చేయాలని సిబ్బందికి ఆర్డీవో రాజేంద్రకుమార్ వివరించారు. ఇంట్లో ఎవరూ లేకపోతే పొరుగువారి ద్వారా సమాచారం ఇచ్చి, మళ్లీ వెళ్లి ఫారం అందజేయాలని, పంపిణీ చేసిన ప్రతి ఫారం వివరాలను నిర్దేశిత రిజిస్టర్/యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచి, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అవసరాలకే ఉపయోగించాలన్నారు. ఈ సూచనలు పాటించడం ద్వారా ‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తవుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది, బీఎల్​వోలు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: 2K Run Awareness | ఉత్సాహంగా 2కే రన్​.. పరుగు తీసిన విద్యార్థులు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *