SIR Voter Survey | ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: SIR Voter Survey | ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ (Bigala Ganesh) అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో బీఎల్​వోల నుంచి ఎన్యూమరేషన్​ పత్రాలను బిగాల స్వీకరించారు.

SIR Voter Survey | పారదర్శకంగా ఓటరు జాబితా..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అర్హత కలిగిన ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ పత్రాన్ని పూర్తిగా, సరైన వివరాలతో నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి, నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్​వోల లేదా ఎన్నికల అధికారులకు అందజేయాలని కోరారు.

SIR Voter Survey | ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి..

SIR Voter Survey

ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. చిన్న నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఓటు నమోదు, సవరణ లేదా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం ఈ ప్రక్రియను సీరియస్‌గా తీసుకుని, ఇంట్లోని ప్రతి అర్హత కలిగిన ఓటరుకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని సూచించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరూ ఎన్నికల సంఘానికి సహకరిస్తూ ఈ సర్వేను విజయవంతం చేయాలని, అలాగే తమ బంధువులు, స్నేహితులు, పొరుగువారిలో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించేలా సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Voter Enumeration Forms | ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలివ్వాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *