అక్షరటుడే, ఆర్మూర్/కమ్మర్పల్లి: YSR Birth Anniversary | దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆర్మూర్, కమ్మర్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
YSR Birth Anniversary | ఆర్మూర్ పట్టణంలో..
ఆర్మూర్ (Armoor) పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రాంరెడ్డి, పండిత్ పవన్, వెంకటగిరి, వాసు, మురళీధర్, జిమ్మ రవి, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.
YSR Birth Anniversary | కమ్మర్పల్లిలో..

కమ్మర్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని జరిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మెంబర్ వేణుగోపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ పాలెపు నర్సయ్య మాజీ అధ్యక్షుడు సుంకేట రవి, డీసీసీ నాయకులు ఏలేటి మోహన్ రెడ్డి, మురళి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కురి దేవేందర్, బద్దం రాజేశ్వర్, సర్పంచ్లు నలిమేల గంగారెడ్డి, అశోక్, గ్రామ శాఖ అధ్యక్షుడు గణేష్, నరేష్, రవీందర్, భూమేష్, చింటురెడ్డి, యూత్ ఉపాధ్యక్షుడు, శిలేందర్, జగదీష్, బుచ్చి మల్లయ్య, నిమ్మ ప్రసాద్, బాలయ్య పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Mad Dog Attack | పిచ్చికుక్క స్వైర విహారం.. ఐదుగురికి గాయాలు