అక్షరటుడే, కామారెడ్డి: Mad Dog Attack | పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఐదుగురు మహిళలపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.
Mad Dog Attack | ఐదుగురు మహిళలపై..
కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు మహిళలపై పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో రాజవ్వ, తిరుపతమ్మతో పాటు మరో ముగ్గురు మహిళలకు తల, కాళ్లు, చేతుల భాగాల్లో గాయాలయ్యాయి. కాలనీకి చెందిన తిరుపతమ్మ తన మనవడిని ఎత్తుకుని కిరాణా షాపుకు వెళ్తుండగా పిచ్చికుక్క ఆమెపైకి వచ్చింది. మనవడిని కాపాడే క్రమంలో తిరుపతమ్మ కిందపడిపోగా కుక్క ఆమె తల, తొడ భాగాలపై తీవ్రంగా కరిచింది. స్థానికులు గమనించి పిచ్చికుక్కను తరిమికొట్టారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న రాజవ్వ, మరో ఇద్దరు మహిళలు, స్కూటీపై వెళ్తున్న మరో మహిళపై కూడా కుక్క దాడి చేసింది. గాయపడ్డ వారిని వెంటనే కాలనీవాసులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాలనీలో పిచ్చికుక్కల బెడద ఎక్కువగా ఉందని, రక్షణ కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై గతంలో పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Janakampet Goods Shed | రేపు జానకంపేట్ గూడ్స్ షెడ్ జాతికి అంకితం.. ఎంపీ కృషితో పూర్తయిన నిర్మాణం