అక్షరటుడే, వెబ్డెస్క్: Shopian Encounter | జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir)లోని షోపియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు. దక్షిణ కాశ్మీర్లోని సైద్పోరా ప్రాంతంలో అతని మృతదేహాన్ని బలగాలు స్వాధీనం చేనసుకున్నాయి.
ఐదు రోజుల క్రితం ఆ ప్రాంతంలోని ఒక దట్టమైన పండ్ల తోటలో నిఘా కెమెరాలలో ఇద్దరు ఉగ్రవాదులు కనిపించడంతో, ఈ ఉగ్రవాది భద్రతా దళాల దృష్టికి వచ్చాడు. లష్కర్ కమాండర్ జాకిర్ గనాయ్, అతని సహచరుడు లతీఫ్ భట్ ఉన్నారనే సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సైద్పోరాలోని ఛానాపోరా ప్రాంతంలో సంచరిస్తుండగా వారిద్దరూ సీసీటీవీ కెమెరాలలో చిక్కారు. వెంటనే ఆపరేషన్ ప్రారంభించి, ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. హతమైన ఉగ్రవాది గుర్తింపును నిర్ధారించుకోవడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి.
Shopian Encounter | పారిపోవచ్చు.. దాక్కోలేరు

ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్ పోలీసులు “మీరు పారిపోవచ్చు, కానీ దాక్కోలేరు” అని పోస్ట్ చేశారు. ఉగ్రవాదిని పట్టుకునే ఆపరేషన్ను జమ్మూ కశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించాయి. భద్రతా దళాలు ఉగ్రవాదులను సమీపిస్తుండగా ఇరువైపులా కాల్పులు జరిగినట్లు సమాచారం. ఆర్మీకి చెందిన ప్రత్యేక ఉగ్రవాద నిరోధక విభాగమైన విక్టర్ ఫోర్స్ పండ్లతోట మీదుగా వెళ్లే మార్గాలను మూసివేసింది. ఉగ్రవాదిని హతమార్చిన తర్వాత భద్రతా దళాలు అతని వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి..: Canada clears India | నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం లేదన్న కెనడా