అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dharmendra Pradhan Resignation | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల వల్ల దేశ వ్యతిరేక శక్తులకు ఎటువంటి ప్రయోజనం కలగకుండా చూడటానికి, దేశం ఐక్యంగా ఉండేలా చేయడానికి, అలాగే భారతీయ విద్యార్థులు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా తమ చదువులు మరియు కెరీర్‌పై దృష్టి సారించేలా చేయడానికి… నేను ప్రధానమంత్రికి నా రాజీనామాను సమర్పించాను అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
Dharmendra Pradhan Resignation | నిరసనల నేపథ్యంలో..
నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా పాకాయి. పలు నగరాల్లో విద్యార్థుల నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలు సైతం విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలు చేపట్టాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని సీజేపీ తెలిపింది. అయితే సీజేపీ ఇతర డిమాండ్లకు శుక్రవారం కేంద్రం ఓకే చెప్పింది. రాజీనామా విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కేంద్ర మంత్రి రాజీనామా సమర్పించారు. దీంతో విద్యార్థులు నిరసన విరమించే అవకాశం ఉంది.
Dharmendra Pradhan Resignation | నాలుగు దశాబ్దాలుగా..
ప్రధానికి రాసిన లేఖలో ప్రధాన్ విద్యారంగంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తాను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల లక్ష్యంతో మమేకమై పని చేశానని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ అనంతరం కేంద్రం వేగంగా స్పందించిందన్నారు. పరీక్ష వివాదం కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు అవకాశాలు దెబ్బతినకూడదన్నదే తన సంకల్పం అన్నారు. ఈ అంశం చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించారు. కొంతమంది వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కొనసాగుతున్న నిరసనలను దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకూడదని, విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టగలగాలని తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: Bihar Student Protest | బీహార్‌లో విద్యార్థుల నిరసన హింసాత్మకం..