అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar Student Protest | నీట్ పేపర్ లీకేజీపై బీహార్‌లో విద్యార్థులు, యువత శనివారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు.
నీట్ పేపర్ లీక్ అంశం, రాష్ట్రంలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల చర్యకు నిరసనగా ఈ రోజు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. పాట్నాలో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో, నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. మరోవైపు ఔరంగాబాద్‌లో రాళ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలను అక్కడికి పంపారు.
Bihar Student Protest | పోలీసు వాహనాల ధ్వంసం
పాట్నాలో నిరసన సందర్భంగా ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్‌చేశారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Bihar Student Protest | తేజ్ ప్రతాప్ యాదవ్ అరెస్ట్
పాట్నాలో జేజేడీ జాతీయ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్, విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా గాంధీ మైదాన్‌లో నిరసన తెలుపుతున్న వారితో కలిశారు. ఆ తర్వాత నిరసన సందర్భంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి..: Dharmendra Pradhan Resignation | ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చినా ఒప్పుకోం : రాహుల్ గాంధీ