Sharad Pawar Modi Meeting | పార్లమెంట్‌లో నిరసనల వేళ.. ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ

పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న తరుణంలో, ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sharad Pawar Modi Meeting | పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న తరుణంలో, ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ-ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సమావేశంలో ఇరువర్గాలు నవ్వుతూ మాట్లాడుకుంటున్న చిత్రాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నీటిపారుదల అంశాలపై ప్రధానికి శరద్ పవార్ ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు.

Sharad Pawar Modi Meeting | డీలిమిటేషన్ బిల్లుపై మద్దతు ..

ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు మూడింట రెండు వంతుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్‌లో ప్రభుత్వ వ్యూహంలో ఎన్‌సీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు కీలకంగా ఉన్నారు. అన్ని వర్గాలకూ 50 శాతం సీట్ల పెంపుపై లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ఎన్‌సీపీ గతంలో స్పష్టం చేసింది.

Sharad Pawar Modi Meeting | విలీనం, రాజకీయ పొత్తుల చుట్టూ ఊహాగానాలు

శరద్ పవార్ పార్టీలోని ఒక వర్గం ఎన్డీఏలో విలీనం కావాలని ఒత్తిడి తెస్తోందనే వదంతులు వినిపిస్తున్నాయి. అయితే, ఎన్‌సీపీలోని రెండు ప్రత్యర్థి వర్గాలు పూర్తిగా ఏకమైతేనే ఎన్డీఏతో పొత్తు లేదా సన్నిహిత సంబంధాలపై చర్చిస్తామని బీజేపీ స్పష్టం చేస్తోంది. కేవలం పవార్‌ను లేదా కొద్దిమంది అనుచరులను మాత్రమే వ్యక్తిగతంగా కూటమిలోకి ఆహ్వానించే ఆలోచన లేదని కషాయం పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ తరుణంలో ప్రతిపక్ష కూటమిలోని కీలక నేత అయిన శరద్ పవార్.. ప్రధాని మోదీతో సమావేశం కావడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇది కూడా చదవండి:  Revanth Reddy Allegations | నాపై కుట్ర చేస్తున్నారు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *