అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Roof Water Harvesting | భూగర్భ జలాలను పెంపొందించేలా సమీకృత కార్యాలయాల(Nizamabad Collectorate) సముదాయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను నిర్మించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గల జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ భవనంలోని రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను బుధవారం పరిశీలించారు.
Roof Water Harvesting | భూగర్భజలాల వృద్ధి..
రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణానికి వ్యయం ఎంతవుతుందనే వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఇదే తరహాలో కలెక్టరేట్లోనూ అనుకూలమైన చోట ఈ పరికరాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తరహా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల వల్ల వర్షపు జలాలు వృథా కాకుండా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని కలెక్టర్ అన్నారు. ఆమె వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి కూడా పరిమితులు ఉంటాయి: పవన్ కళ్యాణ్