Women Doctors Health | ఆరోగ్య పరీక్షలు వాయిదా వద్దు.. మహిళా వైద్యులకు నిపుణుల సూచన

సమాజానికి వైద్యం అందించే డాక్టర్లు.. తరచూ తమ ఆరోగ్యాన్ని మాత్రం విస్మరిస్తుంటారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Women Doctors Health | సమాజానికి వైద్యం అందించే డాక్టర్లు.. తరచూ తమ ఆరోగ్యాన్ని మాత్రం విస్మరిస్తుంటారు. ముఖ్యంగా మహిళా వైద్యులు (  Women Doctors ) వృత్తిపరమైన బాధ్యతలు, ఇంటి నిర్వహణలో బిజీగా ఉంటూ తమ సొంత ఆరోగ్య అవసరాలను రెండో ప్రాధాన్యతగా మారుస్తున్నారు. ఈ అలవాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య వృత్తి అంటేనే తీవ్రమైన ఒత్తిడి, సుదీర్ఘ పని గంటలు. వీటికి తోడు కుటుంబ బాధ్యతలు కూడా నెత్తిన వేసుకున్న మహిళా వైద్యులు, తమ గురించి శ్రద్ధ తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన రక్త పరీక్షలు, స్క్రీనింగ్‌లను వాయిదా వేయడం లేదా చిన్నపాటి అనారోగ్య లక్షణాలను పట్టించుకోకపోవడం సర్వసాధారణమైపోయింది.

Women Doctors Health | ముందస్తు పరీక్షలే అసలైన రక్షణ..

ప్రతి ఏటా ‘ఫుల్ బాడీ చెకప్’ చేయించుకోవడం, రక్తపోటు, షుగర్ స్థాయిలు, కొలెస్ట్రాల్ , థైరాయిడ్ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించుకోవడం ద్వారా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వాయిదా వేయడం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
docter.1

Women Doctors Health | న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ సూచనలు..

ఈ అంశంపై న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ చీఫ్ డాక్టర్ అంకిత శ్రీవాత్సవ స్పందిస్తూ.. “మహిళా వైద్యులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే అది స్వార్థం కాదు, తమ బాధ్యతలను మెరుగ్గా నెరవేర్చడానికి అది ఒక అవసరం” అని పేర్కొన్నారు. వయసు, వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను బట్టి రక్త పరీక్షలతో పాటు.. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ , ఎముకల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

Women Doctors Health | ఆరోగ్యమే అందరి బాధ్యత..

“ఒక ఆరోగ్యవంతమైన వైద్యురాలు తన రోగులకు మరింత మెరుగ్గా చికిత్స అందించడమే కాకుండా, తన కుటుంబానికి అండగా నిలవగలరు” అని డాక్టర్ అంకిత వివరించారు. ఏటా చేయించుకునే ఆరోగ్య పరీక్షలు భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి వంటివని, దీనిపై ప్రతి మహిళా డాక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె కోరారు.

ఇది కూడా చదవండి:  Dichpally Highway | జాతీయ రహదారిపై బైక్​, ఆటో ఢీ..: పలువురికి తీవ్ర గాయాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *