Telangana RTC | ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు.. నంబర్‌ వన్‌గా తెలంగాణ : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసేలా వెయ్యి రోజుల పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana RTC | తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసేలా వెయ్యి రోజుల పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar )తెలిపారు. బస్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఆర్టీసీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు. ప్రయాణికుల వసతులు, ఉద్యోగుల సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Telangana RTC | పెరిగిన రద్దీ..

ప్రస్తుతం రోజుకు 65 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో సంస్థపై భారం పడినప్పటికీ రాజీపడకుండా సేవలు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. పీఎం ఈ-డ్రైవ్‌ కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నామని తెలిపారు. దాదాపు 4 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, ఆటోల రెట్రోఫిట్‌మెంట్ కోసం రూ. 200 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అంకితభావం వల్లే తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలపగలిగామని ప్రశంసించారు.

Telangana RTC | కీలక సంస్కరణలు..

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగంలో పారదర్శకత కోసం చెక్‌పోస్టులను ఎత్తివేసి, ప్రతి జిల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ‘టీఎస్‌’ స్థానంలో ‘టీజీ’ పేరును తీసుకువచ్చామని, కొత్త ఈవీ, స్క్రాప్ పాలసీలను అమలు చేశామని వెల్లడించారు. వాహన్‌ సారథిలో తెలంగాణను భాగస్వామ్యం చేశామని, భవిష్యత్తులో ఎంఎంటీఎస్, మెట్రో సేవలతో ఆర్టీసీని అనుసంధానం చేసి ‘లాస్ట్ మైల్’ వరకు ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Brishti Mukherjee Suicide | మమతా బెనర్జీ ఇంట తీవ్ర విషాదం.. సోదరుడి కుమార్తె ఆత్మహత్య

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *