Jeevan Reddy Comments | నాడు హామీలిచ్చిన సీఎం నేడు అడిగితే తిడుతున్నాడు : మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

నాడు హామీలిచ్చిన సీఎం రేవంత్​రెడ్డి నేడు వాటి గురించి అడిగితే నేడు తిడుతున్నారని బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Jeevan Reddy Comments | నాడు హామీలిచ్చిన సీఎం రేవంత్​రెడ్డి నేడు  వాటి గురించి అడిగితే తిడుతున్నాడని బీఆర్​ఎస్ ​(BRS Telangana) మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి విమర్శించారు. పట్టణంలోని (Armoor)  సిద్దుల గుట్టపైన పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

Jeevan Reddy Comments | చేసిందేమీ లేదు

శివుడికి ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలను బొంద పెట్టిందని మండిపడ్డారు. చీటింగ్, లూటింగ్​లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్ ఖజానాకు కన్నం వేయడం, పాతగోడలకు సున్నం వేయడం తప్ప ఈ వెయ్యి రోజుల పాలనలో చేసిందేమి లేదన్నారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు రూ.వేలకోట్ల బాకీ పడిందని ఆరోపించారు. హామీల అమలు జరిగేంతవరకు బీఆర్ఎస్ పోరు ఆగదన్నారు. తెలంగాణ ఆత్మ కేసీఆర్​కు, ప్రేతాత్మ రేవంత్ రెడ్డికి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: డ్యాన్స్​తో అదరగొట్టిన మీర్జాపూర్​ టీం 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *