El Nino Telangana Farmers | ఎల్​నినో కారణంగా రైతులు రెండోపంట వేయవద్దు : ప్రభుత్వ సలహాదారు

జిల్లాలో యాసంగిలో పంటలు సాగు చేయొద్దని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : El Nino Telangana Farmers | రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం (El Nino Impact) తీవ్రంగా ఉన్నందున రెండో పంట వేయొద్దని ప్రభుత్వ సలహాదారు, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి (MLA Sudarshan Reddy) సూచించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో వున్న ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో కావల్సినంత నీటినిల్వలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోయాయని సుదర్శన్​ రెడ్డి అన్నారు. దీనిపై అవసరమైన కార్యచరణ అమలు చేయడానికి సీఎం రేవంత్​రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారన్నారు.  నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం వల్ల రైతులు,ప్రజలు విద్యుత్‌ను సాగు, తాగు నీరును పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

El Nino Telangana Farmers | డిసెంబర్​ వరకే నీళ్లు..

నిజాంసాగర్​ ప్రాజెక్టు నుండి డిసెంబర్ 2026 వరకే నీరు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు పేర్కొన్నారు. ప్రాజెక్టు క్రింద ప్రత్నమ్య మార్గాల ద్వారా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎక్కడ కూడా నీటి సరఫరాలో లీకేజీలు లేకుండా నీరు వృథా కాకుండా అధికారులు వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలు పొదుపుగా వాడుకోవాలని చెప్పారు.

El Nino Telangana Farmers | రబీ పంటలు వేయవద్దు..

ఎల్​నినోతో రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం నెలకొందని ఈ దృష్ట్యా ఈ రబీ సీజన్​లో ఎలాంటి పంటలు వేయవద్దని రైతులకు సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో తాగడానికి నీరు దొరకడం లేదు.. కొందామన్న విద్యుత్ దొరకడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంటలు వేస్తే పరిస్థితులు మరి దారుణంగా ఉండే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో అధికారులు ముఖ్యంగా సాగునీటి శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, ఎంపీడీవోలు, తహశీల్దార్లు రైతులను, ప్రజలకు అవగాహన కల్పంచేందుకు ప్రత్యేక కమిటీలు వేస్తూ జీపీల్లో దండోరా వేయించాలన్నారు. ప్రాజెక్టులలో నీరు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు.

ఇది కూడా చదవండి: జలకంఠేశ్వర ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *