అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | సుమారు 40 ఏళ్లుగా ఆ కాలనీకి రోడ్డు లేదు.. ఎందరో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వచ్చినా ఈ కాలనీ పరిస్థితి మారలేదు. తాజాగా నిజామాబాద్ నగరంలోని (Nizamabad) 27వ డివిజన్ పరిధిలో ఉన్న సీతారాంనగర్ కాలనీలో రోడ్డు నిర్మాణానికి శుక్రవారం కార్పొరేటర్ కల్పె అర్చన చిరంజీవి భూమి పూజ చేశారు.
Nizamabad City | 27వ డివిజన్లోని సీతారాంనగర్లో..
స్థానిక గుజరాత్ ఫంక్షన్ హాల్ వెనక భాగంలోని సీతారాంనగర్ కాలనీ 40ఏళ్ల క్రితం ఏర్పడినా ఇప్పటివరకు రోడ్డు లేదు. మట్టిరోడ్డుతో అవస్థలు పడుతుండగా.. డివిజన్ కార్పొరేటర్ కల్పె అర్చన చిరంజీవి స్పందించారు. డివిజన్కు ప్రత్యేకంగా మంజూరైన నిధులతో కాలనీలో సీసీ రోడ్డుకు ప్రతిపాదన సిద్ధం చేసి అమలు చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం కాలనీవాసుల సమక్షంలో భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కార్పొరేటర్ కల్పె అర్చన చిరంజీవిని శాలువ, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మెడికవర్ సిబ్బంది డ్రామాలు…