అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Road Accident | నిజామాబాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మున్సిపల్ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద శుక్రవారం Friday రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Nizamabad Road Accident | తీవ్ర గాయాలు
వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ Hanuman నగర్కు చెందిన విఠల్ (46) నిజామాబాద్ మున్సిపాలిటీ జోన్–2లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి పులాంగ్ చౌరస్తా వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో కిందపడిపోయారు. ఈ ఘటనలో విఠల్ తీవ్రంగా గాయపడ్డారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, విఠల్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.