Meesala Srinivasa Rao | ’మీసాల ఫౌండేషన్​ సేవలు అభినందనీయం’

మీసాల ఫౌండేషన్​ అధినేత మీసాల శ్రీనివాస రావు సేవలు అభినందనీయమని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు కొనియాడారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Meesala Srinivasa Rao | విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని నమ్మి ముందుకెళ్తున్న మీసాల ఫౌండేషన్​ అధినేత, విద్యావేత, జనసేన నాయకులు మీసాల శ్రీనివాస రావు సేవలు అభినందనీయమని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు (Ravana Swamy Naidu) కొనియాడారు.

Meesala Srinivasa Rao | పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ..

​హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్​లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో శుక్రవారం మీసాల శ్రీనివాసరావును రవణం స్వామి నాయుడు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు విద్యాసంస్థలను స్థాపించి, ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడంతో పాటు, ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు అందించడంలో మీసాల శ్రీనివాసరావు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారన్నారు. విద్య, ఉపాధి, సామాజిక సేవలను తన జీవిత శ్వాసగా మలచుకొని ఎన్నో కుటుంబాల్లో ఆశాకిరణంగా నిలిచారని పేర్కొన్నారు.

​Meesala Srinivasa Rao | జనసేన పార్టీ బలోపేతానికి నిరంతర కృషి

​గతంలో ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానంలో తన వంతు సహకారం అందించి పార్టీ ఆశయాలకు కట్టుబడి పనిచేసిన శ్రీనివాసరావు, నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాయకత్వం, సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో ముందుకు సాగుతున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా జనసేన పార్టీ విస్తరణకు, సంస్థాగత బలోపేతానికి ఆయన అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు.

​Meesala Srinivasa Rao | రాజకీయం, సేవ, మెగా కుటుంబ అనుబంధాల సమన్వయం

ఒకవైపు రాజకీయ ప్రస్థానం, మరోవైపు సామాజిక సేవ, ఇంకోవైపు మెగా కుటుంబంతో చెక్కుచెదరని ఆత్మీయ అనుబంధం… ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం మీసాల శ్రీనివాసరావు ప్రత్యేకత అని స్వామి నాయుడు ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: ఎల్‌నినోపై ముందుచూపు లేదు.. ప్రభుత్వంపై కవిత ఫైర్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *