KitKat Chocolate Complaint | కూకట్‌పల్లి లులు మాల్‌లో కలకలం.. కిట్‌క్యాట్ చాక్లెట్‌లో పురుగులు ఉన్నాయంటూ కస్టమర్ ఆరోపణ!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: KitKat Chocolate Complaint | హైదరాబాద్ Hyderabad ​లోని ప్రముఖ షాపింగ్ మాల్‌లో కొనుగోలు చేసిన చాక్లెట్‌లో పురుగులు కనిపించాయంటూ ఓ కస్టమర్ చేసిన ఆరోపణ కలకలం రేపుతోంది. కూకట్‌పల్లిలోని లులు మాల్‌లో కొనుగోలు చేసిన కిట్‌క్యాట్ చాక్లెట్‌లో పురుగులు ఉన్నట్లు గుర్తించానని సదరు కస్టమర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆహార భద్రత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చాక్లెట్‌లో పురుగులు కనిపించాయన్న ఆరోపణతో ఆహార పదార్థాల నాణ్యత, భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ప్రముఖ బ్రాండ్‌కు చెందిన ఉత్పత్తిలో ఇలాంటి పరిస్థితి ఎదురైందని కస్టమర్ చెబుతుండటంతో, ఉత్పత్తి నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

KitKat Chocolate Complaint | ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్యల కోసం డిమాండ్

ఈ ఘటనపై ఆహార భద్రత శాఖ అధికారులు విచారణ చేపట్టి, సంబంధిత చాక్లెట్ నమూనాలను పరీక్షించాలని కస్టమర్ కోరుతున్నారు. ఉత్పత్తి నాణ్యతలో లోపాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

అయితే, చాక్లెట్‌లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిశీలన, నమూనాల పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *