అక్షరటుడే, వెబ్డెస్క్: Bachupally Drug Bust | హైదరాబాద్ Hyderabad మహా నగరంలో మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో బాచుపల్లి ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను ఈగల్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి ఎండీఎంఏ (MDMA), గంజాయితో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది.
Bachupally Drug Bust | డ్రగ్స్ కొనుగోలుదారుల వివరాలపై ఆరా
అందిన వివరాల ప్రకారం.. నిందితుల వద్ద నుంచి 6.2 గ్రాముల ఎండీఎంఏ, 5.83 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు రెండు ఐఫోన్లు, పాకెట్ వెయింగ్ మెషీన్ను కూడా సీజ్ చేశారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరెవరికి విక్రయిస్తున్నారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో ఈగల్ ఫోర్స్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్న వినియోగదారుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.