అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganja Seller Arrest | నిజామాబాద్ (Nizamabad) నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీఐ గ్రౌండ్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు.
పోలీసుల దాడి సమయంలో ఓ వ్యక్తి యాక్టివా స్కూటర్‌పై కూర్చొని ఉండగా.. ముగ్గురు అతడి వద్ద గంజాయి కొని సేవిస్తున్నారు. పోలీసులను చూడగానే వారు పారిపోయే యత్నం చేశారు. అనంతరం పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Ganja Seller Arrest | మహారాష్ట్ర నుంచి..
ఈ కేసులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని నగరంలోని అసద్ బాబా నగర్‌కు చెందిన షేక్ పర్వేజ్‌గా గుర్తించాడు. అతడు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఫుర్ఖాన్, నిజామాబాద్‌కు చెందిన అఫ్రోజ్ అనే వ్యక్తి దగ్గర గంజాయి ప్యాకెట్లు తక్కువ ధరకు కొని.. తాగేవారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి తాగుతూ పట్టుబడిన ముగ్గురు యువకుల వయసు 25 ఏళ్లలోపు ఉండటం గమనార్హం.
దీనిని కూడా చదవండి : Kishan Reddy Rahul Gandhi | రాష్ట్రంలో అరెస్టులు.. ఢిల్లీలో ఉపన్యాసాలా?..రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఫైర్