Kishan Reddy Rahul Gandhi | రాష్ట్రంలో అరెస్టులు.. ఢిల్లీలో ఉపన్యాసాలా?..రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kishan Reddy Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో ఎలాంటి ఓటు చోరీ జరగలేదని, ఎన్నికల సంఘం, ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. కాంగ్రెస్ గెలిస్తే ఒకలా, ఓడిపోతే జ్ఞానేశ్ కుమార్ , ఈవీఎంలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. “జ్ఞానేశ్ కుమార్‌ను వదిలిపెట్టబోమని రాహుల్ అంటున్నారంటే, ఆయన దాదాగిరి చేస్తున్నారా?” అని కిషన్ రెడ్డి నిలదీశారు.

Kishan Reddy Rahul Gandhi | రాజకీయాల్లోకి లాగుతున్నారు..

జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పేరును కూడా రాజకీయాల కోసం వాడటం సరికాదన్నారు. అజిత్ దోవల్ పేరు వింటేనే పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని, దేశ యువత హృదయాల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఈ దేశంలో ఓట్లు చోరీ జరగలేదని, ప్రజలు అవినీతికి పాల్పడేవారికి ఓట్లు వేయడం లేదన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)తో సంబంధం లేకుండానే గతం లో బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఘనవిజయాలు సాధించిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం బ్లాక్‌మెయిల్ చేసేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, తీర్పులు అనుకూలంగా రాకపోతే న్యాయమూర్తులపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారో రాహుల్ గుర్తుంచుకోవాలన్నారు. అలాగే మహిళా ఉద్యోగి పట్ల రాహుల్, ప్రియాంక గాంధీ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.

Kishan Reddy Rahul Gandhi | సర్కార్ తీరుపై విమర్శలు..

తెలంగాణలో  ( Telangana ) ప్రతిపక్ష నేతలను నిత్యం అరెస్టు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి వెళ్లి మాత్రం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు, ఢిల్లీలో చేస్తున్న ప్రసంగాలకు అసలు పొంతన లేదని విమర్శించారు.

Kishan Reddy Rahul Gandhi | దేశంపై కుట్రలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు కొందరు విదేశాల నుంచి వచ్చి కుట్రలు పన్నుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఒకరు జర్మనీ నుంచి, మరొకరు అమెరికా నుంచి వచ్చి దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశ అభివృద్ధిని చూసి సహించలేని శక్తులే ఈ ‘డీప్ స్టేట్’ కుట్రలో భాగంగా ప్రజల్లో అసంతృప్తిని పెంచడం, రాజ్యాంగబద్ధమైన సంస్థలపై అపవాదులు మోపుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Armoor RTC Special Bus Fares | ‘స్పెషల్’ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ..!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *