Sabita Indra Reddy | మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం.. ఎన్‌సీడబ్ల్యూకు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sabita Indra Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద తమపై జరిగిన దాడిపై శుక్రవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ (NCW), జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)లకు బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం లిఖితపూర్వక ఫిర్యాదు అందజేసింది.

Sabita Indra Reddy | జాతీయ కమిషన్లకు ఫిర్యాదు..

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అన్యాయంగా అడ్డుకున్నారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీకి వెళ్లి జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించి రాతపూర్వక ఫిర్యాదు సమర్పించినట్లు తెలిపారు.

Sabita Indra Reddy | జుట్టు పట్టుకుని దారుణంగా..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు నల్ల చొక్కా ధరించి వెళ్లినప్పుడు లేని అభ్యంతరం.. కాంగ్రెస్ వైఫల్యాలపై తాము నల్ల దుస్తులు ధరిస్తే ఎందుకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఎలాంటి నినాదాలు లేని సాధారణ నల్ల దుస్తులు వేసుకున్న తమను పోలీసులు టార్గెట్ చేశారని ఆరోపించారు. శాసనసభ్యులమని కూడా చూడకుండా తమ జుట్టు పట్టుకుని, చీరలు లాగుతూ పోలీసులు అత్యంత దారుణంగా దాడి చేశారని ఆమె మీడియాతో మాట్లాకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పురుష ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కేస్తూ భయానక వాతావరణం సృష్టించారని, ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు.

Sabita Indra Reddy | డీజీపీ సమాధానం చెప్పాలి..

మహిళలని కూడా చూడకుండా తమపై శారీరక దాడికి పాల్పడటమే కాకుండా, తిరిగి తమపైనే అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేట్ల వద్ద ప్రజాప్రతినిధులపై దాడి చేయమని పోలీసులకు ఎవరు ఆదేశాలిచ్చారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుతూ అధికార పార్టీ నేతలు అసభ్యకర వ్యాఖ్యలు చేసినా కేసులు పెట్టని పోలీసులు.. ప్రజా సమస్యలపై గళమెత్తిన తమపై దాడులకు తెగబడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:  Alisagar Cable Bridge | అలీసాగర్​పై తీగల వంతెనకు ప్రతిపాదనలు : అడిషనల్​ కలెక్టర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *