అక్షరటుడే, వెబ్డెస్క్: Rosiah Financial Discipline | ఆర్థిక క్రమశిక్షణ అంటే రోశయ్య జీవితమే నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక క్రమశిక్షణ అత్యంత కీలకమని, రోశయ్య విలువలు, క్రమశిక్షణ, ప్రజాసేవను ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించగలరు అన్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సత్కరించారు. అనంతరం కేఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు.
Rosiah Financial Discipline | నిజాయితీకి ప్రతీకగా..

రోశయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాలపై ఆయనకున్న పట్టు, ప్రజాధనాన్ని అత్యంత బాధ్యతాయుతంగా వినియోగించాలనే దృక్పథం దేశంలోనే విశిష్ట నాయకుడిగా నిలబెట్టిందన్నారు. రాజకీయ భేదాలకు అతీతంగా అందరి గౌరవాన్ని సంపాదించిన అరుదైన నాయకుడు రోశయ్య అని పేర్కొన్నారు. నేటి రాజకీయ నాయకులు, యువత రోశయ్య నిరాడంబర జీవనశైలి, ప్రజాసేవ పట్ల అంకితభావం, విలువలతో కూడిన రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఇది కూడా చదవండి..: Warangal Bhadrakali Temple | వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత