తెలంగాణBandi Bhagirath Case | నాకు రెండు రోజుల సమయం కావాలి.. పోలీసులకు బండి భగీరథ్​...

Bandi Bhagirath Case | నాకు రెండు రోజుల సమయం కావాలి.. పోలీసులకు బండి భగీరథ్​ లేఖ

కేంద్ర మంత్రి బండి సంజయ్​ కుమారుడు సాయి భగీరథ్​ తనకు రెండు రోజుల సమయం కావాలని పోలీసులను కోరారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) కుమారుడు సాయి భగీరథ్​ తనకు రెండు రోజుల సమయం కావాలని పోలీసులను కోరారు. ఈ నెల 15న అన్ని ఆధారాలతో విచారణకు హాజరు అవుతానని చెప్పారు. ఈ మేరకు మెయిల్ పంపారు.

బండి భగీరథ్​పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్​ ఏర్పాటు చేసింది. విచారణాధికారిగా కూకట్​పల్లి డీసీపీ రితిరాజ్ (DCP Rithi raj)​ను నియమించింది. ఆయనకు మంగళవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే పేట్​ బషీర్​బాద్​ పోలీస్​ స్టేషన్​లో విచారణకు భగీరథ్​ హాజరు కాలేదు. అనంతరం ఆయన పోలీసులకు మెయిల్​ ద్వారా లేఖ పంపారు.

Bandi Bhagirath Case | విచారణకు సహకరిస్తా

బండీ భగీరథ్ మే 15న అన్ని కీలక సాక్ష్యాధారాలతో పాటు తాను హాజరవుతానని దర్యాప్తు బృందానికి తెలియజేస్తూ, సిట్‌కు ఒక ఈమెయిల్, ఒక అధికారిక లేఖ పంపారు. కొనసాగుతున్న దర్యాప్తులో తన పూర్తి సహకారాన్ని అందిస్తానని కూడా ఆయన సిట్‌కు హామీ ఇచ్చారు. ‘నోటీసులో నిర్దేశించిన తేదీన నేను హాజరు కాలేను. అందువల్ల, నాపై, నా కుటుంబంపై చేసిన తప్పుడు ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తునకు అర్థవంతంగా సహాయపడే నా వద్ద ఉన్న సంబంధిత సామగ్రి, పత్రాలు, సమాచారాన్ని సమీకరించుకోవడానికి వీలుగా, నోటీసులో నిర్దేశించిన తేదీ నుండి రెండు (02) రోజుల స్వల్ప గడువు ఇవ్వాలని’ కోరారు.

Bandi Bhagirath Case | 14న బెయిల్ పిటిషన్​పై విచారణ

బండి భగీరథ్​ తనకు ముందస్తు బెయిల్​ ఇవ్వాలని హైకోర్టు (High Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్​ వెకేషన్​ బెంచ్​ ఎదుట ఈ నెల 14న విచారణకు రానుంది. ఈ క్రమంలో కోర్టు తీర్పు అనంతరం ఆయన పోలీసుల ఎదుట హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే రెండు రోజుల గడువు అడిగినట్లు సమాచారం. కాగా ఈ కేసులో అతడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధం అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భగీరథ్​ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం.

దీనిని కూడా చదవండి : Bandi Bhagirath Case|బండి భగీరథ్ అరెస్ట్ ఖాయం.. విదేశాలకు వెళ్లినా రప్పిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kerala CM Suspense | కేరళం సీఎంపై వీడని సస్పెన్స్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala CM Suspense | కేరళంలో కాంగ్రెస్​...

Mla Bhupathi reddy | విద్యపై ఖర్చు పెట్టడమంటే భవిష్యత్​ తరాలకు పెట్టుబడి లాంటిది..: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Mla Bhupathi reddy | విద్యారంగంపై ప్రభుత్వం పెడుతున్నది...

ACB Raids Shamshabad | ఏసీబీ దాడులు.. డబ్బులు విసిరేసిన ఆర్​ఐ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids Shamshabad | రాష్ట్రంలో అవినీతి...

Bakrid Security Measures | బక్రీద్​ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి.. డీజీపీ సీవీ ఆనంద్​

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Bakrid Security Measures | బక్రీద్​ను ప్రశాంత...