Alisagar Cable Bridge | అలీసాగర్​పై తీగల వంతెనకు ప్రతిపాదనలు : అడిషనల్​ కలెక్టర్​

అలీసాగర్​పై తీగల వంతెనకు ప్రతిపాదనలు పంపనున్నట్లు అడిషనల్​ కలెక్టర్​ భుజంగరావు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Alisagar Cable Bridge | అలీసాగర్​పై (Alisagar Tourism) తీగల వంతెనకు ప్రతిపాదనలు పంపనున్నట్లు అడిషనల్​ కలెక్టర్​ భుజంగరావు పేర్కొన్నారు. శుక్రవారం అలీసాగర్​ను(Alisagar) ఆయన సందర్శించారు.

Alisagar Cable Bridge | పర్యాటక కేంద్రంగా..

అలీ సాగర్​ను పర్యాటక (Telangana Tourism) కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అడిషనల్​ కలెక్టర్​ పేర్కొన్నారు. పార్క్​, ఉద్యానవనం, బోటింగ్ పాయింట్, హరిత హోటల్​ను సందర్శించారు. హరిత హోటల్​లో పర్యాటకుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే బోటింగ్ సిబ్బందికి పర్యాటకుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రాబోయే రోజుల్లో అలీ సాగర్​ను అభివృద్ధి పర్చడానికి కాంపౌండ్ వాల్, తీగల వంతెన, రాత్రి విడిది కోసం ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి పవన్ కుమార్​ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *