Modi Putin Meeting | చర్చలతోనే ఘర్షణలకు పరిష్కారం.. పుతిన్​తో ప్రధాని మోదీ భేటీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ అయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Putin Meeting | రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంపై వారు చర్చించారు. యుద్ధాన్ని ఆపాలని పుతిన్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు.

బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్​ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్​కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన ప్రధానిని కలిశారు. ఇద్దరు నేతలు రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. పశ్చిమాసియాలో యుద్ధం, నల్ల సముద్ర ప్రాంతంలో నెలకొన్న ఘర్షణల గురించి మోదీ, పుతిన్ చర్చించుకున్నారు. ఘర్షణలను పరిష్కరించడానికి చర్చలు, దౌత్యం మాత్రమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

Modi Putin Meeting | రష్యాకు రావాలి

వ్యవసాయం, రైతులపై విస్తృతమైన రచనలు కలిగిన, గొప్ప భారతీయ తమిళ కవి, తత్వవేత్త అయిన తిరువళ్లువర్ రచించిన తిరుక్కురళ్ రష్యన్ అనువాదాన్ని ప్రధాని మోదీ, పుతిన్‌కు బహుమతిగా అందజేశారు. రష్యాకు రావాలని మోదీని పుతిన్‌ ఆహ్వానించారు. 24వ ఇండో-రష్యా సమ్మిట్‌కు హాజరు కావాలని కోరారు. ద్వైపాక్షిక సమావేశం అనంతరం ప్రధాని మోదీ, పుతిన్ రష్యా అధ్యక్షుడి కారులో ప్రయాణించారు. ఈ ఇద్దరు నాయకులు ఒకే కారులో ప్రయాణించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Modi Putin Meeting | వాణిజ్య సంబంధాల బలోపేతం

బిష్కెక్​లో మా సమావేశం జరిగిన రెండు వారాల లోపే, ఢిల్లీలో అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు. ‘ఆర్థిక సహకార కార్యక్రమం 2030’ అమలుతో సహా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, ఇతర రంగాలలో సహకారం గురించి చర్చించినట్లు పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Power Cuts | రైతులకు కరెంట్​ కష్టాలు.. ఎండుతున్న పంటలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
5 Comments