Oracle Layoffs : ఒరాకిల్​ సంచలన నిర్ణయం.. 20 వేల మంది లేఆఫ్‌!

Naresh Chandan
Oracle Layoffs

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oracle Layoffs : ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ Oracle Corporationలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు ఉండనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించే భాగంగా 20 వేల వరకు ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, నిపుణులు ఈ సంఖ్య 20 వేల నుంచి 30 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Oracle Layoffs : ఈ దేశాలపై ప్రభావం..

ఈ ఉద్యోగాల కోతలు ప్రధానంగా ఇండియా, అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా దేశాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంస్థలోని పలు విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులను దశలవారీగా తగ్గించే ప్రణాళికను కంపెనీ అమలు చేయనున్నట్లు సమాచారం.

ప్రత్యేకంగా సంస్థలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న సీనియర్ స్థాయి ఉద్యోగులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపనుందని సమాచారం. వ్యయాలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Oracle Layoffs : గత జనవరిలోనూ..

ఈ కంపెనీలో ఉద్యోగాల కోత ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా Oracle Corporation పెద్దఎత్తున ఉద్యోగాలను తగ్గించింది. గత జనవరి నెలలోనే సుమారు 16 వేల ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం. కేవలం మెయిల్​ ద్వారా ఉద్యోగులకు ఊస్టింగ్​ సమాచారం చేరవేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మారుతున్న వ్యూహాలు, వ్యయ నియంత్రణ చర్యలు వంటి కారణాల వల్ల పలు పెద్ద కంపెనీలు ఉద్యోగాల కోతలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒరాకిల్‌లో కూడా భారీ స్థాయిలో లేఆఫ్‌లు ఉండనున్నట్లు వార్తలు రావడం టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

Telangana DSP Transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *