Congo Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. 14 మంది దుర్మరణం

కాంగో దేశంలో విమానం కూలిపోయి 14 మంది చనిపోయారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Congo Plane Crash | సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలిపోయి 14 మంది చనిపోయారు.

కిక్విట్ నుంచి కాంగో (Congo) రాజధాని కిన్షాసాకు వెళ్తుండగా.. కెంగే ప్రాంతంలో విమానం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోని వారు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు మిలిటరీ ఆఫీసర్లతో కలుపుకొని మొత్తం 14 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

Congo Plane Crash | విమానంలో అధికారుల బృందం

మృతుల్లో దేశ సైనిక న్యాయస్థానానికి అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నారు. ఆ విమానంలో సదరు ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన బృందం ప్రయాణిస్తోందని అధికారులు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం ఎందుకు తలెత్తింది, ప్రమాదానికి దారితీసిన కారణం ఏమిటనేది అధికారులు స్పష్టం చేయలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాంగోలో సంక్షోభం నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం. అక్కడ సైన్యం అనేక సాయుధ సమూహాలతో పోరాడుతోంది.

ఇది కూడా చదవండి..: Nagaland Spurious Liquor | కల్తీ మద్యం తాగి 19 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *